మమ్ము వదలి.......



                                                                                                                           పేరడీ పాట : శర్మ జీ ఎస్


( బాబూ మూవీస్ వారి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఈ " మంచి మనసులు " చిత్రం 1962 లో విడుదలై విజయభేరి మ్రోగించబడింది . ఆ చిత్రానికి మన సుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన ' నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే " అన్న పాటకు ఈ నాటి రాజకీయాలకు పేరడిగ వ్రాయబడ్డది .)

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే ,
మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .

ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
మీరు  లేని మేము లేనె లేములే... లేములే  ,
ఓట్లు లేని మాకు విలువలేదులే ఇదీ నిజములే ,
                        మీరు  లేని మేము లేనె లేములే... లేములే  .                          

మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
మీ మనసే చిక్కుకునే మా ఓట్ల వలలో ,
మా ఓట్లు మీ నోట్లు నిండెను మీ మదిలో ,
చిరకాలపు మీ కలలే ఈ నాటికి నిజమాయే ,
దూరమైన ఆ స్థానాలు చేరువైపోయె ఓ... ,

ఓట్లు లేని మీకు విలువలేదులే ఇదీ నిజములే ,
                           మేము లేని మీరు లేనె లేరులే... లేరులే .                           

మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని , 
మందు మత్తులో కనులు మూసుకుని ,
మొఖము వంచుకుని ,
చెయ్యరాని ఘోరాలు చెయ్యమని .
ఆకర్షించే ఆ సీటులో అమాంతంగా కూచొని ,  
                        పొంగిపోయే శుభదినం రానున్నదిలే ఓ... ,                           

మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' ,
ఓట్లు లేక మీరు నిలువలేరులే... లేరులే .


అసెంబ్లీలో  అగపడుతూ , తడబడుతూ  మెలమెల్లగా ,
మీరు కూర్చోగా , 

ఆ సీటు హొయలు మీలోని పొగరు మాలోన ,
కంగారు రేపగా , 

నాయకులు కలసి ఉయ్యాలలూగి అవకాశమే ,
అందుకొనగా ,
      పైపైకి సాగి అసెంబ్లీలు దాటి అందరాని స్థానాలు అందుకోగా ,  

                ఆహా..ఓహో..ఉహూ...ఆ..ఆ..ఆ... ,                          

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

మీరు లేని మేము లేనె లేములే..లేములే  ,

ఓ...మిమ్ము వదలి మేము పోలేములే ఇదీ నిజములే ,

                      మమ్ము వదలి మీరు పోలేరులే అదీ నిజములే' .                       


                                                                                                    ******                                                                                                                                                                                                                                

ఓటు - వేటు

                                                                                                           
                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్

దవాఖానాలో ఉన్నా ,
ఆఖరికి ,
పాయిఖానాలో వున్నా , 
చిట్లించుకొంటున్నా ,
ఛీదరించుకొంటున్నా , 
నాకూ , నా వాళ్ళకి ,
యిచ్చినంత ప్రాముఖ్య ,
వాళ్ళ భార్యకే కాదు ,
వాళ్ళను కన్నవాళ్ళకు గాని ,
వాళ్ళు కన్నవాళ్ళకు గాని ,
ఇవ్వనే యివ్వరు ,

వాళ్ళ 5 ఏళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ,
తేల్చే వాడిని , నేనేనని  ,
( ఓటరుని  కదా ! )
కటిక నేలపైనైన ,
ఏ నాయకులైనా  , 
నాకొఱకు పడిగాపులు కాస్తారు ,

అలా నా ఓటు అందుకున్నాక ,
అదేనండి , 
రేపు గెలిచాక ,
ఆ పదవులను అంటిపెట్టుకొని , 
ఆ సీటు కొఱకు తాము వెచ్చించిన దానికి ,
పదింతలని రాబట్టుకోవటంలో వాళ్ళు చూపే శ్రధ్ధలో , 
నన్నే మఱచిపోతారు ,
మఱచిపోవటం మానవ నైజమేనని ,
అనుకొని సర్ది చెప్పుకోవచ్చు ,
కానీ , 
నేనెవ్వరో గుర్తు చేసినా , 
గుర్తుకు వచ్చినా , రానట్లు , 
అసలు తెలియనట్లు ప్రవర్తించే ఆ తీరుకే , 
ఓటు వేయాలన్న మనసు ,
కలగటం లేదు ,
 ఆలోచనే రావటం లేదు ,
చదువుకున్న నాకైనా , 
చదువు తెలియని మా అమ్మా , అయ్యలకైనా ,
డొనేషన్లు కట్టి చదువు కొనే నా వారసులకైనా .

  ******

ల ల లాం లక్కీ ఛాన్సులే


                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

( ( 1959 లో విడుదలైన ( అంటే స్వాతంత్ర్యం వచ్చిన 12 ఏళ్ళకన్నమాట )  " ఇల్లరికం " తెలుగు సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు వ్రాసిన ఈ పాటకు నేటి రాజకీయ నాయకులకు పేరడీగా వ్రాయటం జరిగింది  ))


భలేచాన్స్ భలేచాన్సులే...
భలేచాన్సులే భలేచాన్సులే
లలలాం లలలాం లక్కీచాన్సులే
భలేచాన్సులే
అధికారంలో వున్న మజా...
అధికారంలో వున్న మజా..
అది అనుభవించితే తెలియునులే,
తెలియునులే,
భలేచాన్సులే...

అమాయకపు ప్రజలకు  ఒక్క నాయకుడౌ ,
అదృష్ట యోగం పడితే , పడితే ,
పోటీదారులే లేకుంటే
ఆ నాయకుడిదే అధికారం ,
అధికారం ,
భలేచాన్సులే...

మందుపోసినా అమృతంలాగా
కమ్మగా ఉందనుకుంటే
బహుకమ్మగా ఉందనుకుంటే
ఛీ, ఛా అన్నా చిరాకు పడక
దులపరించుకు పోయేవాడికి
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

సీ బీ ఐ  పట్టుకుని బయటికీడ్చినా,
చెఱసాలలో ఫెట్టినా ,
సీటు పట్టుకొని వేలాడీ , వేలాడీ ,
దూషణ భూషణ తిరస్కారములు
ఆశీస్సులుగా తలచేవాడికి  ,
భలేచాన్సులే (అధికారంలో వున్న మజా )

అణగి మణగి ఉన్నామంటే
అంతా మనకే చిక్కేది (2)
పైసా పైసా కూడబెట్టితే
మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనవాళ్ళకే కాదా దక్కేది
అది మనకే ఇహ మనకే
అది మనకే మనకే మనకే
వదలను కనకే , కనకే , కనకే .

              *******

నా న్యూ నుడులు - 10



1  .  ఆకట్టుకున్నదానితో ఆనందించకు  ,
        ఆ కట్టుకున్నదానితోనే ఆనందించు . 
      
2  .  కనిపించిన కన్నెపిల్లలను వదలలేడు ,
       కట్టుకున్న తల్లితండ్రులను మాత్రం వదిలేస్తాడు  .

3 .   గమ్యం తెలియకుంటే అంతా అగమ్యమే ,
       అదే తెలుసుకుంటే అంతా సుగమమే .
      
4 .   ఒకరికి అన్యాయం చేయకపోవటమే ,
       న్యాయం చేయటానికి సుముఖతగా ఉన్నట్లే .

5.    వయసులో ముద్దులు,
       వయసైనాక ముద్దలు  . 

6.    కొస మెఱుపులే ,
       పస తెలుపులే .

7.   రోగం ఒక్క రోజులో రాదు ,
      ఒక్క రోజులో తగ్గదు కూడా .

8.   అవసరమైతే దిశ మార్చుకో ,
      సునాయాసంగా దశ హెచ్చులే . 

9    వ్యసనాలు అంటుకొంటే వదలవు
      పాసనాలు పట్టుకుంటే ఆగవు .

10  . దూరపు కొండలు నునుపు ,
      దగ్గరకెళ్తే ఆ కొండలే గణుపు



                                                                                                              ( మఱి కొన్ని మరో మారు )