ఎంపైర్ ( ఏ ) స్టేట్ బిల్డింగ్

                       
                                                                             ఎంపైర్ ( ఏ ) స్టేట్ బిల్డింగ్

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్


                                                             
                                                                                  ఎంపైర్ (ఎ) స్టేట్ బిల్డింగ్

ఉదయం 11.50 కి మేమందరం బయలుదేరాం న్యూయార్క్ లోని లిబర్టీ స్టాట్యూ చూడాలని . 1.15 కి చేరుకొన్నాము . పక్కనే వున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడటనికి టైం సరిపోతుందని నిర్ణయించుకొని , చక చకా కారు పార్కింగ్ చేసుకొని , స్ట్రాలర్స్ లో ముగ్గురు పిల్లల్ని కూర్చోపెట్టుకుని నడుచుకొంటూ  చేరు కొన్నాము . అల లోపలకి వెళ్ళగానే , లిఫ్ట్ 2 వ ఫ్ళోరు లోకి వెళ్ళి లైన్ లో నుల్చొని సెక్యూరిటీ చెక్  పూర్తి అయిన తర్వాత , మరల లైన్ లో నుల్చొని టికెట్ తీసుకున్నాము . ఒకరికి 25 డాలర్లు . 



పిల్లలకు 6-12 లోపు 19 డాలర్స్ .సీనియర్స్( 62 )కి 22 డాలర్లు . మొత్తం 144 డాలర్లు పే చేసి అలా అలా చూసుకొంటూ లిఫ్ట్లో వెళ్ళి 80 వ ఫ్లోరులో దిగిఅక్కడనుంచి మరో లిఫ్ట్ లో అబ్జర్వేటరీ వ్యూయింగ్ ఏరియా 86 వ ఫ్లోరుకు చేరుకున్నాము మేం  మా వెంట తెచ్చుకున్న స్ట్రాలర్స్ తో . అక్కడనుంచి న్యూయార్క్ సిటీని చుట్టూరా చూస్తూ ఫొటోలు తీసుకున్నాము . అద్భుతమైనదృశ్యాలే అవి , ఆనందాలలో తేలియాడే క్షణాలే అవి .




 అలా అలా చూస్తూ తనివితీరిందని
పించుకొని ,  మెల్లగా మరల రిటర్న్ బయలుదేరాము .నిజానికి ఈ 86 వ ఫ్లోర్ పైన ఇంకా 16 ఫ్లోర్లు వున్నాయి .ఆ 102 వ ఫ్లోరు లోంచి న్యూయార్క్ సిటీని అంత గొప్పగా చూడగల చక్కటి ప్లేస్ అది . పిల్లలతో అక్కడకి వెళ్ళటం కొంచెం యిబ్బంది అనుకొని , అక్కడకి వెళ్ళలేదు . షుమారుగా ఆ పైన 2 .30 గంటల సమయం గడిపాం ఆ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్పైన . రిటర్న్ అయ్యాము లిఫ్టులో . ఆ లిఫ్ట్ 10 ఫ్లోర్లు ఒక మారు మారుతుంటుంది .

క్రిందకు రాబోయే ముందు మరల్ ఆ ఫ్లోర్లలో వున్న యాడ్స్ ప్రక్కన కొన్ని ఫొటోలు , కంప్లీట్ 1 వ ఫ్లోర్ ( గ్రౌండ్ ఫ్లోర్ ) లోవున్న ఆ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఆఫీస్ వద్ద నుల్చొని మరల అందరం ఫొటొలు తీసుకున్నాము .బైటకు వచ్చి ఆ బిల్డింగ్ ఎక్స్టీరియర్ ఫొటో తీసుకున్నాము .

ఆ సరికి ఇక్కడి టైం సాయంత్రం 5 గంటలయింది . నేను , మా ఆవిడ ఆ బిల్డింగ్ బయట బెంచి మీద కూర్చుంటే , మిగిలిన అందరూ స్నాక్స్ తిని , రెస్ట్ రూం పనులు ముగించుకుని వస్తామన్నారు  . అలా ఓ 30నిముషాలు కూర్చు
న్న తర్వాత వాళ్ళు వచ్చారు .

మన ఇండియా వాళ్ళు ఈ చలికి వళ్ళంతా స్వెట్టర్స్ తో , మంకీ క్యాపులతో , లేకుంటే శాలువాలతో కవర్  చేసుకుం   టుంటే , ఇక్కడి వాళ్ళు కామకేళికి ప్రధానమైన వాటిని మాత్రమే   మూసినట్లుగా కనపడ్తూ , మిగిలిన శరీరాన్ని
అలా స్వేఛ్ఛగా ఆ చల్లగాలికి వదిలేస్తున్నారు .

ఈ శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటు చేసుకొని మసులుకుంటుంది అని  అలా పలుమార్లు ఋజువైంది  .

ఈ లోగా అక్కడ లోకల్ సిటీ బస్సులలో క్రింద , పైన కూర్చొని సిటీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు , ఆ ఫొటొ కూడా ఒకటి తీసుకొన్నాను .




                                                                                       సిటీ సైట్ సీయింగ్ బస్

ఆ తర్వాత , నేనూ మా ఆబ్బాయి , ముగ్గురు చిన్నపిల్లల్ని మా వద్ద వుంచుకుని , మిగిలిన ముగ్గురు ఆడవాళ్ళను షాపింగ్ కి పంపాము . ఒక 40 నిముషాల తర్వాత వాళ్ళు  వచ్చారు . అందరం కలసి మెల్లగా స్ట్రాలర్స్లో నున్న పిల్లలను తీసుకొని , నడుచుకొంటూ పార్కింగ్ వద్దకు బయలుదేరాము .
దారిలో ఒక షాప్ ముందు ఉన్న బొమ్మల ప్రక్కన మా పెద్ద మనుమడు కూర్చొని ఫొటో తీయించుకున్నాడు . వరుసగా మిగిలిన ఆ ఇద్దరు పిల్లలు కూడా కూర్చొని ఫొటోలు తీయించుకొన్నారు .




ఆ ప్రక్కనే వున్న లిబర్టీ స్టాట్యూ వద్ద నుల్చొనిఫొటొలు తీయించుకొన్నారు . అలా మెల్లగా పార్కింగ్కు చేరుకొని , షుమారుగా 7 అంటలకు రిటర్న్ బయలు దేరాము .


                                                                             
                                                                                         *************

మందులా

                                                                మోతాదు మించితే  

 
                                                                                                                                 రచన : శర్మ జీ ఎస్   

ఏవైనా అలవాట్లు అధికమై , వాటి వల్ల మన జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నప్పుడు అవే అలవాట్లు వ్యసనాలుగ నామకరణం చేయించుకోబడ్డాయి . అలా చేయబడినవే ఈ సప్త వ్యసనాలు  .

అవే జూదము , మాంస భక్షణము , సురాపానము ( మత్తు మందులు సేవించుట ) వేశ్యా సంగమం , వేట ( జీవహింస ) పర స్త్రీ లోలత్వము లు  .

ఈ కాలంలో దాదాపుగా అందరూ ఈ (సప్త ) వ్యసనాలనే వాటిని అధికంగా అనుభవిస్తూ బాగా వున్న వాళ్ళని మనం నిత్యం సమాజంలో  చూస్తూనే వున్నాము . కనుక వీటిని వ్యసనాలుగా మనం చెప్పుకోకూడదు యిపుడు .  దీనిని    బట్టి మనము అర్ధం చేసుకోవలసినది ఏమిటంటే , మనసు బలహీనమైనవారికి మాత్రమే వ్యసనాలుగ మిగిలి
పోతున్నాయని .  

ఈ వ్యసనాలనేవి ఆయా దేశకాలమాన పరిస్థితులను బట్టి నిర్ణయించబడ్డాయే తప్ప అవి స్థిరమైనవి కాదని  అర్ధం చేసుకోవాలి  .

అయితే పైన మన పూర్వీకులు చెప్పినట్లుగా ఆ సప్తవ్యసనాల వల్ల మాత్రమే కాదు జీవితాలు నాశనమయ్యేది .

సృష్టి ఆరంభం నుంచి , ఈ జీవుల నుంచే మరల మరల జీవుల సృష్టి జరుగుతుండటం వలన , ఆ జీవులకుండే శక్తి క్రమక్రమంగా క్షీణించిపోతుంది .  అదే సమయంలో  కొన్ని గుణాలు ఈ శక్తిహీనమైన జీవుల మీద అధిక  ప్రభావం      చూపడంతో , క్రమేపీ ఆ మామూలు గుణాలు కూడా దుర్వ్యసనాలుగ  దర్శనమీయటం ప్రారంభించాయి  . అందు
వలన , క్రమేపీ చిన్న చిన్న విషయాలకు అలవాటు పడి , వాటిలోనే మునిగి తేలుతుండటం వలన  ఈ వ్యసనాల సంఖ్య అధికమవుతూ వచ్చింది .  

ఈ వ్యసనాల సంఖ్య  7 వద్దనే ఆగక , అలా అలా  నానాటికీ అధికమైపోతున్నది  . ఈ అలవాట్లు మనకిచ్చే ఫలి
తాల్ని బట్టి అవి సదలవాట్లా , దురలవాట్లా అన్నది నిర్ణయించబడ్తుంది . 

మంచివై కొనసాగిస్తే జీవితం హాయిగా గడచిపోతుంది ఎవరికైనా .
చెడు గుణాలు కొనసాగిస్తే జీవితం భారమై దుర్భరమై పోతుంది ఎవరికైనా .

మోతాదు మించకుండా వున్నంతవరకు ఏవైన అలవాట్లుగ వుండిపోతాయి . ఈ అలవాట్లే ( చిన్నవైన / పెద్దవైన ) . మోతాదు మించితే వ్యసనాలుగ మారి విశ్వరూపంతో స్వైరవిహారం చేసేస్తాయి , వున్నపళాన పండంటి జీవితాల్ని పనికిమాలిన జీవితాలుగ నిరూపిస్తాయి .

కనుక అలవాట్లను వ్యసనాలుగ మార్చకుండా , వాటికి బానిసలు కాకుండా  తగు జాగ్రత్తలో మనమున్నట్లైతే మన జీవితాలు , మనలను నమ్ముకున్నవారి జీవితాలు  హ్యాపీగా , సాఫీగా సాగిపోతాయి . 


                                                                                             ********

అద(ర)హో లేక్ తాహో


                                                                                       అద(ర)హో  లేక్ తాహో

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

 అద(ర)హో  లేక్ తాహో
ఈ రోజు అర్ధరాత్రి 2.30 కి లేచి వరుసగా అందరం రెడీ అయ్యాము . ఈ లోపల నా శ్రీమతి అన్నం వండేసింది , రాత్రే రెడీ చేసిన చిత్రాన్నముతో సహా అన్నీ ప్యాక్ చేసుకొని ఉదయం 5.45 కి మా రెంటల్ ఇన్నోవాలో లేక్ తాహో చూడటా
నికి బయలుదేరాము . జీ పి ఎస్ లో అడ్రెస్ ఫీడ్ చేయగానే 3.45 గంట జర్నీ అని చూప్పించింది . ఉదయాన్నే బయ
లుదేరటం వలన ఆ హైవేలో  మార్గమధ్యంలో ఒక గ్యాస్ స్టేషన్ వద్ద బ్రేక్ తీసుకున్నాము 9 గంటలకు . రెస్ట్ రూం కార్యక్రమాలు  పూర్తిచేసుకొని , బ్రేక్ ఫాస్ట్ గా తెచ్చుకొన్న చిత్రాన్నాన్ని అందరం ఆరగించాము .

ఈ లేక్ తాహో కొండల పైన ఉండటం వలన , ఏపుగా పెరిగిన వృక్షరాజాలు , లోతైన లోయలు అందంగా దర్శనమి
స్తూ ఆనందాన్ని  అందచేస్తున్నాయి . ఆ సరికే భాస్కరుడు ప్రకాశాన్ని మాత్రమే అందిస్తున్నాడు . ఆ బ్రేక్ 45 నిము                  షాలు తీసుకోవటం జరిగింది . మరల గమ్యం వైపు బయలుదేరాము . 10.25 గంటలకి లేక్ తాహో చేరుకొన్నాము . మేము అనుకొన్న హెవెన్లీ విలేజ్ హోటల్ అండర్ రిపేరులో వుండటంతో వెహికిల్ పార్కింగ్ కొరకు ఓ గంట వెతకా
ల్సొచ్చి ముందు ఆ పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు వద్ద షాప్ ప్రక్కన ఖాళీ స్థలంలో ( వాళ్ళ అనుమతితోనే ) పార్క్ చేసి మా అబ్బాయి విచారణ చేయటానికి వెళ్ళాడు .

లేక్ తాహోలో సైకిలిస్ట్ లు
లేక్ తాహోలో సైకిలిస్ట్ లు
ఇక్కడ అంటే ఈ అమెరికాలో  చాలామంది ఆడ , మగ అందరు సైకిలింగ్ ఎక్కువగా చేస్తుంటారు బాగా డబ్బున్న వాళ్ళు కూడా . అది వ్యాయామం లా భావిస్తారు , అవమానంగా కాని , పేదరికంగా గాని భావించరు . ఈ సైకిలింగ్  కి వయ్ససు తార
తమ్యాలు లేవు . ఆ సైకిళ్ళు చూస్తుంటే ఎంత సింపుల్ గా ఉన్నాయో , అంతకన్నింతలు వేగంగా వెళ్తుంటాయి . పటిష్టంగానూ వుంటాయి . ఆ దారులు అంతకంటే అందం గానూ వుంటాయి .
ఒక అర్ధ గంటలో మావాడు వచ్చి గొండోలా సైట్ సీయింగ్ ఇపుడు ఆపేశారుట 14 జూన్ వరకు . మనం ఇంకో వైపుకు వెళ్ళి అక్కడ ట్రై  చేద్దామన్నాడు . మళ్ళీ బయలుదేరాము అటు రివా గ్రిల్ వద్దకు .

రివా గ్రిల్
ఈ వచ్చే మార్గమధ్యంలో చాలామంది ఎక్కడెక్కడనుంచో వాళ్ళ వాహనాలలో అక్కడకు వచ్చి , వాహనాలను పార్క్ చేసి , ఆ పక్కనే వున్న ఒక ఆఫీసుకాని ఆఫీసు ముందు బారులు తీరి నుల్చొన్నారు . ఏమిటా ? అని చూస్తుంటే , కొంతమంది విచిత్ర వేషధారణతో బయటకు వస్తున్నారు . వాళ్ళను చూస్తే ఒక్కమారు కొన్ని వేల ఏళ్ళ సంవత్సరా
లు వెనుక జీవించిన వాళ్ళ జీవనశైలి చూస్తున్నామనిపిస్తుంది .

గత జన్మల నమ్మకం వాళ్ళకు లేకపోయినా , చరిత్రను నమ్ముతారు కనుక , ఆ వేషధారణ వేసుకొని , వాళ్ళు ఆ                
ఫీల్ రావటం కొరకు ఆ అడవుల్లో గుడారాలు వేసుకొని , రాళ్ళు పొయ్యిలా పెట్టుకొని  కట్టె పుల్లలతో , ఆ నాటి పాత్రలతో ఆహారం తయారు చేసుకొంటూ ఎంజాయ్ చేస్తున్నారు . దీనికి పేపర్లో ముందుగా యాడ్ యిస్తారుట ఈ       విచిత్ర ధారణ ఆఫీస్ వాళ్ళు .

అక్కడనుంచి అలా అక్కడకి దగ్గరలో వున్న రివా గ్రిల్ బీచ్ రెసార్ట్ వద్దకు వచ్చి వాహనం పార్కింగ్ చేశాము . ఆ సరికి మధ్యాహ్నం 12.15 అయింది . మేము తెచ్చుకొన్న అన్నం అందరం ఆ కారు పార్కింగ్ వద్దనే తినేశాము . అక్కడే వున్న ఆ లేక్ తాహో సెలయేరు ఆఫీసుకి వెళ్ళి వివరాలు కనుక్కొని వచ్చింది మా కోడలుపిల్ల . వాళ్ళు ఆ ఎలెక్ట్రిక్ బోటులో తీసుకువెళ్ళి అలా ఆ లేక్ మొత్తం తిప్పుతూ  10 నిముషాలు   పారాసైలింగ్ లో పైకి పంపించి ఆ ఆనందాలను మనకు కలిగించి 1 గంట లోపల వెనకకు తీసుకువస్తారుట . ఇక్కడ ఎలెక్ట్రిక్ బోట్స్ రెంటల్ కి  కూడా యిస్తారుట . మనంతటా మనమే ఆ సరస్సులో డ్రైవ్ చేసుకొంటూ అంతా చూసుకొంటూ ఎంజాయ్ చేసి రావచ్చు . దీనికి ఒక గంటకు 120 డాలర్లు . మనం అడిగితే గైడ్ని ( డ్రైవర్ ని )మనతో పంపుతారు . దానికి చార్జెస్ ఎక్స్ట్రాగా పే చేయాలిట . పారాసయిలింగ్ షో ఎన్ని గంటలకని అడిగితే 4 గంటలకని చెప్పారు . ఈ లోపల ఖాళీ లేదన్నారు . దానికే అడ్వాన్స్ గా బుక్ చేసుకొన్నాము . పెద్దవాళ్ళ నలుగురికి 75 డాలర్ల చొప్పున ఒక్కొక్కరికి  , చిన్న పిల్లలిద్ద
రికి 20 డాలర్ల చొప్పున ఒక్కొక్కరికి టికెట్లు తీసుకున్నాము . ఆ టికెట్లు ఇవ్వబోయేముందు మన వివరాలు పూర్తిగా అందులో పొందుపరుస్తూ , ఏమైనా ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగితే వాళ్ళ పొరపాటేమీ లేదని , ఆ బాధ్యత మనదేనని హామీ పత్రం సంతకంతో పూర్తి చేయాలి . ఆ సరికి మా లంచ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి 1.45 గంటలైంది . ఇంకా అప్పటిదాకా ఎక్కడకి పోతామని  , ఈ లోపల ఎలెక్ట్రిక్ బోట్ అద్దెకు

రెంటల్ బోట్లు యివే
తీసుకొని ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామను
కున్నాం . మా అబ్బాయే డ్రైవ్ చేశాడు . అందరం వెళ్ళి
వచ్చాము ఆ బోట్ గైడ్ కి 20 డాలర్స్ టిప్ యిచ్చి 3.30 కల్లా ఆ ఆఫీసుకి వచ్చాము .

నా శ్రీమతి పారాసైలింగ్ కి రాననటంతో , 2 అబ్జర్వేషన్ పాస్ లు తీసుకొని , 4 ప్యారాసైలింగ్ పాస్ లు 1200 అడుగుల ఎత్తుకి మనల్ని పంపుతారు ఆ ప్యారా
చ్యూట్ లో . తీసుకొని ఆ ప్యారాసైలింగ్ బోట్ వద్దకు చేరుకున్నాము . ఈ లోగా అమెరికన్ల సంస్కృతి మాకు దర్శనమిస్తూనే వున్నది .ఆ తదుపరి మేము ఆరుగురం , మరో ముగ్గురు కలసి బోట్ ఎక్కాము . ముందు వాళ్ళ ముగ్గురిని 800 అడుగుల ఎత్తుకి ప్యారాచ్యూట్ లో పంపారు .

నేను గతంలో ఎప్పుడూ పారాసెయిలింగ్ ఎక్కలేదు . ఇదే ప్రధమం . అయితే నాకు ముందు రెండు బ్యాచ్ లు వెళ్ళి రావటం చూడటంతో కొంత అవగాహన వచ్చింది , కొన్ని జాగ్రత్తలు తెలిశాయి . అందుకే మన పెద్దలు అంటుంటారు చేసైనా ఉండాలి లేక చూసైనా ఉండాలి అని . పైకి వెళ్ళిన తర్వాత మంకేమైనా యిబ్బందిగ వుంటే , మన మోకాళ్ళ
ను వెనుకకి , ముందుకి వూపితే వాళ్ళు మనల్ని అక్కడినుంచి క్రిందకు దింపుతారు . ఇది వాళ్ళకు మనమిచ్చే సంకేతం . నిజమేనని యిప్పుడు అర్ధమైంది .

ఆ తర్వాత మా కొడుకు కోడలు , పెద్ద మనుమడు , ఈ  ముగ్గురిని ఆ పారాసైలింగ్ హుక్ కి లింక్ చేసి 1200 అడుగుల ఎత్తుకి పంపారు . వాళ్ళకు కొన్ని ఫొటోలు , కొన్ని వీడియోలు తీశాను .

ఈ లోపల ఆ పారాసైలింగ్ అతను వచ్చి మీరొక్కరేనా అని మీ వెయిట్ ఎంత ? అని అడిగాడు . ఆ , నేనొక్కడినే , వెయిట్ 59 కిలోలు , మీరెవరైనా నా ప్రక్కన వస్తారా అని అడిగాను . అతను బదులివ్వకపోయేసరికి నా ఇంగ్లీష్ ఆ అమెరికన్ వాళ్ళకి అర్ధం కాలేదేమో అనుకున్నా . నాకొచ్చిన ఇంగ్లీష్ ఇండియాలో మాత్రమే అర్ధమవుతుందని అపుడే తెలుసుకున్నాను .ఈ లోగా మా కొడుకు , కోడలు , నా పెద్ద మనుమడు పై నుంచి క్రిందకు దిగారు . వాళ్ల ముగ్గురికని ఆ పారాసెయిలింగ్ కి తగిలించిన 3 హ్యాంగర్స్ హుక్ తీసి నన్ను త్వరగా రమ్మన్నాడు . ఈ లోగా మా అబ్బాయి సలహా యిచ్చాడు డాడ్ పైకి వెళ్ళటం ఆరంభమైనప్పటినుంచి , కొంచెం పైకి వెళ్ళే వరకు క్రిందకు చూడకు , కళ్ళు తిరుగుతాయి . సరేనన్నా . ఈ లోగా అతను నన్ను పిలిచి ఆ పారాసెయిలింగ్ రోప్స్ కి డైరెక్ట్ గా నన్ను హ్యాంగ్ చేశాడు .

పారాసైలింగ్ సమయంలో నేను
ఇదంతా వెంటవెంటనే జరిగింది . వేరే ఏ ఆలోచనకు అవకాశం లేకుండా . వెంటనే మెల్లగా పైకి వదిలాడు .  మెల్లగా పైకి వెళ్తుంది , క్రిందకు ఒక మారు చూసి , పైన చుట్టూరా కలయజూస్తున్నాను . నిరామయ ప్రదేశం , నిర్మలమైన ప్రదేశం , మలయ మందమారుతాలని విన్నా గతంలో . ఇక్కడ ఈ స్థాయిలో అది అనుభవించాను . ఈ లోపల మధ్య మధ్యన వాళ్ళు క్రిందనుంచి పైకి పంపించటానికి వదుల్తున్న వైర్ రోప్ శబ్దంవినపడ్తుంటుంది . ఆ హ్యాంగర్ హుక్ లేకపోవటం వలన నా రెండు చేతులను ఊర్ధ్వదిశగా వుంచి అరచేత్తో కుడి ఎడమల వున్న రోప్స్ ని పట్టుకొనటం కొంచెం యిబ్బందికరంగా వున్నది .  ఆ  రోప్స్ ఒరుసుకోవటం వలన . అలాగే పట్టుకొని అలా అలా ఆ ప్రయాణాన్ని ఆనందించాను . కొంత సమయం తర్వాత వాళ్ళు మెల్లగా క్రిందకు ఆ రోపుని క్రిందకు తీసుకోవటంతో నేను క్రింద ఉన్న బోట్ లో దిగాను . అయితే క్రిందకు దిగుతున్నప్పుడు మన కాళ్ళని పూర్తిగా చాచి వుంచాలి . అప్పుడు సుల
భంగా ఆ బోటులో దిగగలం . అలగే దిగాను . ఈ లోగా మా కొడుకు , కోడలు నాకు ఫొటోలు , వీడియో తీశారు . ఆ బోట్ డ్ర్రైవర్ కి 10 డాలర్లు టిప్ యిచ్చి అక్కడనుండి మెల్లగా వెనుతిరిగాము . ఇక్కడ " మీరు యివ్వదలుచుకొంటే ఎవరికైనా టిప్స్ యివ్వవచ్చ్హు " అన్న ప్రకటనలు పబ్లిక్ గా అక్కడక్కడా కనపడ్తూనే వుంటాయి .


                                                                                            *****************

ల్యాప్ టాప్ బేబ్


                                                                          ల్యాప్ టాప్ బేబ్

                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

            (  మాలిక వేగవంతమైన బ్లాగుల సంకలిని లోని 15/06/2013 పెండెం గారి చిత్రానికి నా చిన్న కథండి  )





వనజ వరుణ్ లు కొత్తగా పెళ్ళైన పడుచు జంట . పెళ్ళై 3 నెలలు తిరగకుండానే , నెల తప్పేలా చేశాడు . వనజ ఎంత
గానో ఆనందం చెందింది .

ఓ నాడు "   వరుణ్ "   అంటూ అతని వక్షస్థలం మీద తన కుడి చేత్తో మెల్లగా గీరుతోంది .

"   ఏమిటి ? "   అని అడిగాడు .

"   నాకు మనల్ని తల్లితంద్రులుగా చేస్తున్నదెవరో తెలుసుకోవాలని ఉంది "   అన్నది .

"   ఎవరో ఎందుకు చేస్తారు ? మనకు మనమే చేసుకొంటున్నాం . నీకు తెలియలేదా ? "   అన్నాడు .

"   తెలుసు , మనం చేస్తున్న ఆ సంసారం వల్లనేనని . "

"   అంత తెలిసినదానివి మరి ఎలా అడిగావ్ అలా ? "

"   మనల్ని తల్లితండ్రులని చేస్తున్నది బాబా ? పాపా ? అని ."

"   అదా ! ఎవరైనా అందులో తేడా ఏముంది ? ఎవరికైనా మనం డాడ్ & మామేగా ."

"   నిజమేననుకోండి . కాకుంటే బాబా ? పాపా అని తెలుసుకోవాలన్నది నా కోరిక "   అన్నది .

"   మన ఇండియాలో ఆ అవకాశం లేదుగా . "

"   అవకాశం లేదని నా కోరికను చంపుకోమంటావా ? "

"   మరింకేం చేస్తాం ? "

"   ఎం చేస్తావో  నాకు మాత్రం తెలియదు , నాకు తెలియాలి  అంతే ."

"   అదెలా కుదురుతుంది ? "

"   నేనేమైన సీతలా బంగారు జింకను తెమ్మన్నానా ? పారిజాతపు పువ్వునడిగానా ? లేక నాగలోకపు మణి 
నడిగానా ? లేదే ? సింపుల్ గా నా కడుపులో ఉన్న బేబీ గురించి అడిగానంతే ."

"   నువ్వడిగింది చిన్న కోరికైనా అవకాశం లేనప్పుడు అది తీర్చలేనిదై చాలా పెద్దదిగానే వుంటుంది . "

"   అందరూ అనుకుంటుంటే విన్నాను . భార్య కడుపుతో ఉన్నపుడు భర్త అడిగిన కోరిక తీరుస్తాడని . "

"   తీర్చగలిగిందైతే . "

"   తీర్చ లేకపోవటానికి , నిన్నేమైనా కొండలెక్కమన్నానా ? కొండమీద కోతిని  తెచ్చిమ్మన్నానా ? నా కడుపులో వున్న బేబి ఎవరో తెలుసుకోమన్నాను అంతేగా ."

"   మన ఇండియాలో పాప అని తెలుసుకొని , ఆ కడుపులోనే చంపేసేస్తున్నారని , ఆ విధానాన్ని నిషేధించారు . "

"   ఆ విషయం నాకూ తెలుసు వరుణ్ . మనం అలా చపుకునేవాళ్ళం కాదుగా . "

"   ఆ విషయం మనకు తెలుసు , వాళ్ళకు తెలియదుగా . "

"   తెలియజేసి , అనుమతి తీసుకో , అవసరమైతే బాండ్ కూడా వ్రాసిస్తామని చెప్పు . "

"   ఎవరూ మన మాట వినరు ."

"   అయితే నా కోరిక తీర్చవా ? మనసుంటే మార్గముంటుందంటారుగా , నీకు నా మీద మనసు లేదన్నమాట ."

"   అలా అనకు ,ఆలోచిస్తున్నా . అవును మీ ( స్వంత )పిన్ని డాక్టరేగా , కనుక్కోక పోయావా ? "   అన్నాడు .

"   ఆ ప్రయత్నం చేసి చూశాను . ప్రయోజనం లేకపోయింది . ఈ విషయంలో ప్రభుత్వం స్ట్రిక్ట్ గరూల్స్ ఫాలో చేస్తు
న్నారుట . లంచాలకు కూడా ఎవరూ తలవంచటం లేదు .  ఎవరు అతిక్రమించినా వాళ్ళ లైసెన్స్ లు జీవితకాలం నిషేధిస్తారున్నారుట .ఇండియా ఒక్క ఈ విషయంలోనే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నది . "

"   అయిన వాళ్ళ వల్లే కావటం లేదంటే , ఇంక ఎం చేస్తాం "   అనుకొన్నాడు .

"   మనకు పుట్టే పిల్లలు బాబో , పాపో తెలియకుండా కనటం నాకిష్టం లేదు . నువ్వు ఎలాగైనా తెలుసుకొని చెప్పు "   అంటూ నిద్రాదేవి ఒడిలో సోలిపోయింది వనజ .

ఆ రాత్రంతా అలాగే ఆలోచిస్తూ ఆలస్యంగా నిద్రపోయాడు .
ఇలా 3 రాత్రులు గడచాయి . వనజ ప్రక్కనుందనే గాని , ఆ ఆలోచన తప్ప మరో ఆలోచనకు తావు లేకుండా పోయిం
ది .
ఈ అవకాశం యూ ఎస్ లో మాత్రమే వున్నది . పుట్టబోయే బేబి బాబా లేక పాపా అన్నదే కాకుండా , అసలు డెలివరీ టైంలో ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రి అయిన వాడు  ఆ కనబోయే సమయంలో తల్లి ఎదుట వుండాలిట . కనుక యూ ఎస్ లోని తమ హెడ్ ఆఫీసు వాళ్ళతో సంప్రదిస్తే ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమోనని అనుకొన్నాడు .

యూ ఎస్ లోని హెడ్ ఆఫీస్ వాళ్ళతో సంప్రదించాడు , సమస్యను వివరించాడు . వాళ్ళు సాల్వ్ చేస్తానన్నారు .
"   మిష్టర్ వరుణ్ , మీరు చేయవలసినదల్లా ఒక్కటే . ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు , మీ ఇండియా టైం ప్రకారం గూగుల్ లైవ్  స్కానింగ్  లోకి  రండి , మీ మిసెస్ ని ఒకమారు స్క్రీనులో  చూపించండి , ఇక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వున్నారు , వాళ్ళ అత్యాధునికమైన సాంకేతిక నిపుణతతో స్కాన్ చేసి , మీకు స్క్రీన్ మీద లైవ్ లో చూపిస్తారు . డోంట్ వర్రీ మిష్టర్ వరుణ్ . ఇటీజ్ వెరీ ఈజి "   అని బదులిచ్చారు .

"    థాంక్యూ సో మచ్ "    అని తన భార్యకు కాదు , తనకే డెలివరీ అయినంతగా ఆనందం పొందాడు .

అదే విషయాన్ని వనజకు చెప్పాడు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే . వనజ ఆనందానికి అవధుల్లేవు . తను అనుకు
న్నది సాధించగలిగుతున్నానన్న గొప్ప సంతృప్తి .
ఆ రోజు అర్ధరాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూస్తున్నది . "  ఇంకా పదిన్నరేనా ?  అబ్బ 12 గంటలు ఎప్పుడవు
తుంది వరుణ్ ?  "   అన్నది .

"   రోజూలాగే ఈ రోజు 11.59 తర్వాతే 12 అవుతుందిట , మార్పేమి లేదుటే "   అన్నాడు .

"   అలాగా ! నేను ముందు 12 అవుతుంది , 11 తర్వాత అవుతుందనుకున్నానే "   అంటూ వెక్కిరించింది .

"   కాకపోతే ఏమిటే ? కాలం ఎప్పుడూ ఒకలాగే వుంటుంది , వుండనిదల్లా మన మనసే . మనకు పని వున్నా , లేకపోయినా కాలం ముందుకు సాగిపోతూనే ఉంటుంది . మనం ఒకదాని కొరకు ఎదురుచూసినప్పుడు మాత్రం కాలం ఎంతకీ ముందుకు పోకుండా వున్నట్లు వుంటుంది . అది మన భ్రమే . కాలం ఎప్పుడూ , ఎవరి కొరకు ఆగటం గాని , అలాగని ముందుకు పరుగెత్తదు . ఆ తపన మాత్రం మనకు అలాంటి భావాల్ని కలిగిస్తుంది "   అన్నాడు .

అర్ధరాత్రి 12 అయింది , వాళ్ళ యూ ఎస్ హెడ్ ఆఫీస్ వాళ్ళు యిచ్చిన సలహా మేరకు గూగుల్  లైవ్  స్కానింగ్  కి   అటెండ్ అయ్యేటందుకు ల్యాప్ టాప్ ఆన్ చేశారు . వనజని స్క్రీన్ మీద చూపించాడు , ఒకటికి రెండు సార్లు .
వెంటనే స్కానింగ్ అరేంజ్ మెంట్స్ మొదలయ్యాయి . 5 నిముషాలలో బేబ్ జెండర్ తెలిసిపోయింది . వనజకు , వరుణ్ కి కూడా అమిత ఆనందం కలిగింది . చలాకీగా అటు , యిటూ కదుల్తూ , హెల్దీగా కనపడ్డాడు . అలా చూస్తుంటే పదే పదే చూడాలన్న ఉత్సాహం ఎక్కువైంది యిద్దరిలో . అలా చూస్తూనే వున్నారు . కొంతసేపటికి ఆ బాబు ల్యాప్ ట్యాప్ చెక్ చూస్తున్నట్లు కనపడటంతో ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యారు , మెల్లగా ఆ దిగ్భ్రాంతి ఆనందాశ్ఛర్యాలుగా పరి
వర్తన చెందింది . 
అపుడనిపించింది సాఫ్ట్ వేర్ దంపతులు అహోరాత్రులు ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ వుండటం వలన వాళ్ళకు పుట్టబోయే బిద్దల మీద కూడా ఆప్రభావమే ఈ పర్యవసానమని తెలుసుకొని నవ్వుకున్నారిరువురూ . ఇది అంతా వీడియో తీశాడు వరుణ్ . యూ ఎస్ ఆఫీస్ వాళ్ళకు ధన్యవాదాలు తెలిపారిరువురూ .

వనజ్ వరుణ్ ని తన బిగి కౌగిలి లో బంధించాలనుకున్నా , కడుపులో వున్న పిల్లవాడు గుర్తుకు వచ్చి , మెల్లగా
ముద్దులతో సరి పెట్టుకోమంది .

చూడాలనిపించినపుడు అలా ఇంటిలోని టీ వీ లో చూసుకొంటూ ఆనందిస్తున్నారు .


                                                                     ** స ** మా **  ప్తం **

U S లివర్ మోర్ టెంపుల్

                            
                                                                U S  లివర్ మోర్ టెంపుల్

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్





సహజంగా దేవుణ్ణి పూజించటానికి గాని , దేవాలయాలను సందర్శించటానికి గాని పలు కారణాలు అంతర్గతంగా ఉండవచ్చు , పైకి మాత్రం ఐదు కారణాలు స్పష్టంగా కనప్డ్తుంటాయి .

మొదటిది : భక్తి  .
ఎక్కువగా యిది వయసు మళ్ళిన వాళ్ళకు వర్తిస్తుంటుంది . జన్మను తరింప చేస్తుందన్న తపనతో యిలా గుళ్ళు , గోపురాలను దర్శిస్తుంటారు .

రెండవది :  భయం .
ఇది కొంతమంది పెద్దవాళ్ళకు , ఇంకా అక్రమ సంపాదన వశులైనావాళ్ళకు వర్తిస్తుంది .  ఈ జీవితాన్ని చక్కగ వెళ్ళ
బుచ్చేటందులకై ఆ దేవుడనబడే ఆకారాన్ని భయంతో పూజించి , జీవితాన్ని చక్కగ వెళ్ళదీయమని చేసే చిన్న క్లాసికల్ మనవి , కొంచెం మనం సమర్పించుకొనే అదో రకమైన లంచాలతో . 

మూడవది  : గౌరవం / భయం .
దేవుడు , దేవతల మీద భక్తి కాదు , భయమూ కానిది . పెద్దలంటే గౌరవం / భయం కలిగినది . ఇది చిన్నపిల్లలకు వర్తిస్తుంది .

నాల్గవది : తపన . 
రంగు రంగుల పడుచులను చక్కగా పైసా ఖర్చు లేకుండా చూసుకోవచ్చు , అవకాశం దొరికితే ఓ ట్రయల్ వేద్దాం అన్న చిన్న చిరు ఆశతో  వెళ్ళే కుఱ్ఱకారుకి వర్తిస్తుంది . 

ఐదవది : మూఢభక్తి  .
మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు , వాళ్ళు ఆచరిస్తున్నారు . మనమూ ఆచరిద్దాం , ఏదైనా వస్తే వస్తుంది , రాలేదా నష్టమేమీ లేదు అనుకొని అటుగా అడుగులు వేసే వాళ్ళకు వర్తిస్తుంది .


ఈ రోజు 10.40.కి రెంటల్ కారులో లివర్ మోర్ టెంపుల్ చూడటానికి బయలుదేరాము .  ఆఖరికి అనుకున్న దాని
కంటే అర్ధగంట ఆలస్యంగా 1232 , యారో హెడ్ లో నున్న  ఆ లివర్ మోర్  టెంపుల్ కి చేరుకొన్నాము .

ఆ ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశిస్తుంటే రకరకాల వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి నలువైపులా . పార్క్ చేయటానికి ప్లేస్ దొరకక , 5 నిముషాల పిమ్మట ఖాళీ అయిన ప్లేసులో పార్క్ చేశాము .

అలా ఆ కారులు బారులు తీరి పార్కింగ్లో ఉండటం చూస్తుంటే , మన భారతీయులు ఇక్కడ కింగుల్లా వెలిగిపోతున్నా
రన్నట్లు అర్ధమవుతుంటుంది . ఇలా ఈ అమెరికాలో ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన విధంగా కింగ్ డంలు ఏర్పాటు చేస్తున్నారు , అసలు దేవుడే లేడు , విగ్రహారాధన లేదు అన్నది వారి ప్రధమ బలీయమైన భావం . జీవుడే దేవుడు / దేవత అన్నదే వాళ్ళ అసలు సూత్రం . ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవించవచ్చు , ఎంతవరకంటే , ఎదుటి
వారి స్వేఛ్ఛ కక్షలోనికి నువ్వు ప్రవేశించనంతవరకు అన్నదే .అందుకే ఇలా ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టదు . ఎందుకంటే వాళ్ళ ప్రధమ నిబంధనే దానికి మూల కారణం .  

ఆ తర్వాత లోపలకి వెళ్ళాము . అక్కడనుండి కాలిబాటన సరాసరి వెళ్ళి ఎడమవైపు తిరగగానే పాదరక్షలు భద్ర
పరిచే గది ఆఫీసు , ఆ ప్రక్కనే రెస్ట్ రూంస్ , వీటికెదురుగా  సంస్కృత పాఠశాల , ఆ ప్రక్కన ప్రసాదము కౌంటరు .
ఆ కౌంటర్ నుంచి బైటకు వచ్చి ఎడమ వైపున కాలి బాటన వెళ్తూ , ఆ కంపౌండ్ వాల్ దాటగానే కార్లదారి దాతగానే కుడి , ఎడం,అన రెండు రెండు ట్యాపులు క్రిందగా ఉంటాయి . అక్కద పాద , కర ప్రక్షాళనం కావించుకొని , ఎడమ వైపుగా వున్న 2 సింహద్వారాల గుండా లోపలకి ప్రవేశించగానే , కుడి వైపున విషయ విచారణాధికారి ఉంటాడు . ఎడమ వైపున చిన్న చిన్న విగ్రహాలతో దేవతా విగ్రహాలు ఉంటాయి .

ఆలయానికి నడుమ వినాయకుడు , శివుడు , పార్వతి , శ్రీదేవి ( లక్ష్మి ) , బాలాజి ( విష్ణు ) , కనకదుర్గ మరియు
అయ్యప్ప స్వామి యిలా దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి . అభిషేకములు , అర్చనలు , భజనలు ఒక వైపు , ఆ వెనుక భవంతి( ఫంక్షన్ హాలు ) లో . ఈ ఫంక్షను హాలుకి ఈ ఆలయానికి నడుమ ఓపెన్ హాలు . అక్కడ రైట్ సైడ్ డిన్నర్ చేసేటందుకు వీలుగా  టేబుల్స్ , లెఫ్ట్ సైడ్ ప్రసాదాల టేబుల్స్ ప్రసాదాల ట్రేలతో నిండి , డిస్పోజబుల్ ప్లేట్లు , స్పూన్స్ కార్టన్లతో నిండి ఉంటాయి . ఎవరైనా , ఏదైనా ప్రసాదం చేసుకువచ్చి అక్కడ ( ఈ చేసుకొచ్చిన ) వాళ్ళే , ఆ దేవి విగ్రహం ఎదుట నైవేద్యం పెట్టి , ఆ ప్రసాదాన్ని తాము కొంత తీసుకుని , మిగిలినది అక్కడ ప్రసాదాల కౌంటరు వద్ద టెబుల్ వద్ద ఉంచిపోవాలి . ఆ తర్వాత బారులు తీరిన భక్తులు వాళ్ళు వాళ్ళ డిస్పోజబుల్ ప్లేట్లలో పెట్టుకొని ఆరగిస్తుంటారు .దానికి కుడివైపుగా ఒక లైనులో బారులు తీరిన భక్తులు ప్రసాదాలకై నిరీక్షిస్తుంటారు . ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రసాదాల వద్దకు వచ్చి డిస్పోజబుల్ ప్లేట్లు , స్పూన్ తీసుకొని వాళ్ళంతట వాళ్ళే పెట్టుకొని అవతలకి వెళ్ళి ఆరగిస్తారు కావలసినంత . కొంతమంది ఆ ప్రసాదాన్నే , సాదంగా ఆరగిస్తుంటారు . అదమాయించి , అడ్డం చెప్పే
వాళ్ళు ఎవరూ వుండరు . అలా ఆ ప్రసాదం సద్వినియోగమవుతుందని ఆనందపడ్తారు , వృధా కాకుండా .ఇదే ప్రదేశంలో గోడ ప్రక్కగా వాష్ బేసిన్స్ , డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ తో రెడిగా ఉంటాయి . వీటికి కొంచెం దూరంలో ఎడమ వైపు 2 డస్ట్ బిన్స్ ఎప్పుడూ నింపించుకోవటానికి రెడీ చేయబడి ఉంటాయి .

కళ్యాణమండపం కూడా చక్కటి వసతులతో ఉన్నది . ఎవరిదో తమిళ వాళ్ళ తిరుమణం  ( కళ్యాణం )  జరుగు
తున్నది .

ఈ దేవాలయాలు అందర్ని కలపటానికి ఉపయోగపడ్టాయి అన్నది మనం గ్రహించుకొంటే చాలా మంచిది .

కనుక ఎవరు ఎలా ఆ సర్వ సద్గుణశక్తిని ఆహ్వానిస్తారో ఎవరికి వారే నిర్ణయించుకొంటే తదనుగుణంగా సత్ఫలితాల్ని అందుకోగలరు .
                                                                             ********

దమ్ముండాల


                                                                               దమ్ముండాల                                                                           

                                                                                                                                   రచన : శర్మ జీ ఎస్

                                                                                                              

                                                                                                                                      




                                                                                                                                   

 ఒకవైపు హాలీవుడ్ , మరొకవైపు లాస్ ఏంజల్స్ , ఇండియా ఆంధ్రాలో సికింద్రాబాద్ , హైదరాబాద్ లలా . అటువంటి   హాలీవుడ్ లోని యూనివర్సల్ స్టూడియో ఆవరణ అది  . వీక్షించటానికి ప్రవేశ రుసుము ఒక మనిషికి 149 డాలర్లు ఫ్రంట్ లైన్ పాస్ ఇది . జనరల్ క్యూలో నుల్చోకుండా , గేట్ ఆ గుండా అనుమతిస్తారు . వి ఐ పి పాస్ అయితే 299 డాలర్లు , ఏ మాత్రం ఆలస్యం ఎక్కడా లేకుండా అనుమతిస్తారు . 89 డాలర్ల టికెట్ ఇంటర్నెట్ లో బుక్ చేస్తే 2 డేస్ అనుమతిస్తారు .  

ఏ రోజు కా రోజు వాళ్ళు వీక్షింపజేసే ప్రదర్శనల వివరాలు అన్నీ ఏ రోజుకారోజు వివరంగా తెలియచేస్తుంటారు పాంప్లెట్ల రూపంలో . ఆ షెడ్యూలు ప్రకారం అన్నీ చూడవచ్చు . ఎక్కడా ఏ షోకి ఏమీ పే చేయనఖ్ఖర్లేదు . 

ఏదైనా మనం తినాలనుకున్నా , కొనాలనుకున్నా , అన్నీ అక్కడే లభ్యమవుతాయి . మనం ఎక్కడ ఏ రైడ్ కి వెళ్ళి
నా , ఎక్కడ ఫొటో తీయించుకున్నా , అక్కడ వున్న ఫొటో ల్యాండ్ వాళ్ళు యిచ్చే ఆ కార్డు చూపించినా , లేకుంటే  ఆ షో వివరాలు తెలియచేస్తే మన ఫొటొ , మనకు చూపిస్తారు . 8 క్ష్ 10 సైజ్ 24.95 డాలర్లు పే చెయ్యాలి . ల్యామినేషన్ తో కావాలనుకుంటే మరో 5 డాలర్లు పే చేయాలి . వద్దంటే వాళ్ళేమి యిబ్బంది పెట్టరు . 
  
 ఆ జురాసిక్ పార్క్ రైడ్ కి 3.50 కి వెళ్ళి 4.30 షోకి లైనులో నుల్చొన్నాం . ఇక్కడ ఏది చూడాలన్నా ( ఫ్రీగా చూపి
స్తున్నా ) పేద్ద పేద్ద క్యూలు (  తిరుపతి , షిర్డి ఆలయాలను ) ఙ్నప్తికి తెస్తాయి . అలా క్యూలో నుల్చొని 40 నిముషా
లకు రైడ్కి వెళ్ళే బోటులో కూర్చొన్నాము . 3 వ వరుసలో ఆఖరున నేను , నా పక్కన నా శ్రీమతి కూర్చున్నాము . 

సహజంగా బోట్ లో ముందు వరుసలో కూర్చొంటే , మనం తడిసే అవకాశాలు , ఝడిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . సావకాశంగా ఆనందించే వీలు ఉంటుంది . 

అందరికీ కామన్ గా ఒక సేఫ్టీ మెజర్మెంటుగా అర్ధ చంద్రాకారంగా వున్నదానిని మా కాళ్ళ ముందుకు వంచారు . ఈ జురాసిక్ పార్క్ రైడ్లకు సెంట్రల్ కంట్రోల్ ఆఫీస్ అక్కడే సపరేట్ గా వుంటుంది . వాళ్ళే బటన్ నొక్కుతారు . ఈ బోటు నీళ్ళలోనే చైన్ సిష్టంలో నడుస్తుంది జస్ట్ లైక్ ట్రైన్ . మా బోట్ బయలుదేరింది . అలా పైకి ఎక్కి క్రిందకు దభాలున దిగి , ఎడమవైపుగా తిరిగింది , అక్కడ మూసి వున్న గేటు దానంతట అదే తెరుచుకున్నది . మరలా అలా ముందుకు వెళ్తుంటే , ఎడమవైపు పేద్ద డైనోసారా మన బోట్  మీదకు వంగి మనలని పట్టుకొంటుందేమోనన్న భయం కలిగించి , ఆ పక్కనే వున్న ఓ కొమ్మను కొరికి , నములుతూ నీళ్ళు మనమీదకు చల్లుతుంది . ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మరల ఇంకా కొన్ని డైనోసారాలు , పిల్లలు , నడివయసువి మీదకు వస్తున్నట్లుగా , తొంగి చూస్తున్నట్లుగా మిడకు వస్తున్నట్లు వుంటాయి . మరికొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు ఉన్న కొండచరియ క్రిందగా వెళ్ళి ముందుకు వెళ్తుండగా  , కుడివైపున పైనుంచి ఆ జురాసిక్ పార్క్ సినిమాలో చెడిపోయిన కారు , పడ్తుంది క్రిందకు , మనమీద పడ్తుందేమో అన్న భయం కలిగిస్తుంది . అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే , కొండ గుహలోంచి పైకి వెళ్తుంది . అలా వెళ్ళేటప్పుడు వేగాన్ని అందుకుంటుంది . అదెలా వుంటుందంటే క్రిందనుంచి సరాసరి ఆకాశం వైపు వెళ్తున్నట్లుగా వుంటుంది . ఒక్కసారి అందరి గుండెలు జారుతుండగా , పై నుంచి ఓ డైనోసారా మీదకు దూకుతుంది. 

అంతదాకా చీకటిగా వున్న ఆ ప్రదేశం కాంతులు వెదజల్లుతుంటుంది . ఇక భయ పడటం మన వంతు అవుతుంది . అలా ఎంతసేపో వుండదు , ఆ డైనోసారాకు అందకుండగా గభాలున క్రిందకు దించి కుడివైపుగా వెళ్తుంది బోట్ . ఇంకొంచెం ముందుకు రాగానే 5 , 6 డైనోసారాలు మనమీదకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి . భయం గుప్పెటలో దాక్కొని ఉంటాము . ఎక్కడా ఆగదు ఈ బోటు . హమ్మయ్య  తప్పించుకున్నాం లే అనుకొంటుండగా , మరల పైకి తీసుకెళ్తాడు , పైనుంచి  అతి పెద్ద డైనోసారా మనమీదకు దూకుతుంది  మనం ఊహించం కూడా . ఎలాగైనా ఈ గండం నుంచి బయట పడ్తే బాగుండు అన్న ఆలోచన మనకు కలిగే లోపల , మనల్ని తప్పించటానికి చేసే ప్రయత్నం అన్నట్లుగా ఒక్క సారి అంత ఎత్తునుంచి క్రిందకు ఎత్తి పడేస్తాడు . అక్కడనుంచి ఆ బోట్ మామూలు స్థాయికి రావటంలో ఆక్కడ వున్న నీళ్ళు పైకెగురుతాయి , గుండె జారి గల్లంతైంది అని అనుకోకుండా వుండలేము . బ్రతుకు జీవుడా అని బైటకు వచ్చేస్తాము ఆ బోట్ రైడ్ నుంచి . 

నిజానికి ఈ రైడ్ యింత యిదిగా వుంటుందని ముందుగా తెలిసుంటే , మాలాంటి వాళ్ళు వెళ్ళరు అనుకొంటాను నేను . వాస్తవానికి అక్కడ కొన్ని నియమ నిబంధనలను సూచించే బోర్డు వుంటుంది ఈ రైడ్స్ కి . అది నేను మొదట చూడలేదు . గుండె జబ్బులవాళ్ళు , హై బీ పి , లో బీ పి వాళ్ళు , బ్యాక్ పెయిన్ , నడుము నొప్పులు వున్నవాళ్ళు , గర్భవతులు , విరోచనాలతో , వాంతులతో బాధపడ్తున్నవాళ్ళు , సర్జరీ చేయించుకున్నవాళ్ళు , 4 అడుగుల ఎత్తు లోపు చిన్న పిల్లలు ,  ఈ రైడ్స్ చేయకూడదని , ఒక వేళ వారి ఉత్సాహంతో వారు చేస్తే , ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలకు మాకెటువంటి సంబంధం లేదని వివరంగా లిఖించబడి , ప్రకటించబడి వుంటుంది ప్రతి రైడ్ వద్ద .

ఇది వయసువాళ్ళకు , తట్టుకునేవాళ్ళకు ఓ గొప్ప థ్రిల్ . అనుమానమేమీ లేదు  .

డబ్బులొక్కటే చాలదు , అసలు దమ్ముండాల , అపుడే గుండె దిటవుగా వుంటుంది . ఆ దమ్మే ఇలాంటి రైడ్స్ కి 
అసలు సిసలు గుండె బలం  .

                                                             **************

దేవుళ్ళ , దేవతల పుట్టు పూర్వోత్తరాలు


                                                            దేవుళ్ళ , దేవతల పుట్టు పూర్వోత్తరాలు

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్ 

సృష్టి ఆరంభం నుంచి  ఆకారుడైన మానవుడు , నిరాకారమైన శక్తిని తెలుసుకొన్నా , ఎలా గుర్తుంచుకోవాలో తెలియక ( సతమతమవుతూ ) ఆ నిరాకారమైన శక్తికి తనలాగే రూపాల్ని కల్పించి , వావి వరుసలు తగిలించి కొలువనారంభించాడు .

వాస్తవానికి ఆ శక్తి గుణకారిణి .

అలా కనపడని , అనుభూతమయ్యే ఆ శక్తి స్వరూపాలకు గుణాలు ప్రతిరూపాలు . గుణాలు రెండు రకాలు  ధర్మము , అధర్మము ని . ఇవే మానవ జీవనగమనంలో మంచి , చెడు ని / పుణ్యము , పాపము ని , సుఖము , దుఃఖము ని / సత్యము , అసత్యము ని /  న్యాయము , అన్యాయము ని / అహింస , హింస ని  చెలామణీ అవుతూ వస్తున్నాయి .


ఇందులో ధర్మం , సుఖం , సత్యం , పుణ్యము , న్యాయం , అహింస లాంటివన్నీ మంచికి మారుపేరుగా , ఆ మంచిని దైవానికి ప్రతిరూపాలుగ  భావిస్తూ వచ్చారు అనాదిగా , అదే పునాదిగా తలచి . 

ఇంక మిగిలిన ఆ అధర్మం , దుఃఖం , అసత్యం , పాపము అన్యాయం , హింస లాంటివన్ని  చెడుకి ప్రతిరూపాలుగా భావిస్తూ వచ్చారు అనాదిగా , అదే పునాదిగా తలచి  . 

అలాంటి మంచి గుణాలు కలిగిన మనుషుల్ని, జీవుల్ని దైవంగా భావించటం , అలాంటి చెడు గుణాలు కలిగిన వారిని , జీవుల్ని దెయ్యాలుగా గుర్తించటం జరిగింది . ఇదే ఈ మానవుల నైజంగా నిలిచిపోయింది . 

మంచి గుణాలు కలిగిన మనుషుల్ని, జీవుల్ని దేవతారూపాలుగా భావించారు ఆ కృత (సత్య )యుగ మానవులు . అలా ఆ గుణాలు తకూ రావాలని , తాము  అంతటి గుణ (శక్తి )వంతులు కావాలని , ఆ గుణాల వలన  తాము 
వాళ్ళు ఆనందించాలని , తమ మానవజన్మ తరించాలని భావించి ఆ గుణాలని  గుడ్డిగా కొలవలేక ,ఆ గుణాలకే
లింగ భేదాలతో  ఆకారాలనేర్పరచి , ఆ కారాలకే దేవుడు , దేవతలగ నామకరణం చేశారు .

తమకు లాగే  భవ బంధాలు తగిలించారు .
పూజలారంభిచారు ఆ నాటి మానవులు .
అలా సృష్టింబడిన దేవతలే , ఈ నాడు పూజలందుకొంటున్నారు .

విఘ్నాల (ఆటంకాల ) గుణాన్ని  విఘ్నేశ్వరుడుగా

సృష్టి గుణాన్ని బ్రహ్మగా ,

పోషణ గుణాన్ని విష్ణువుగా ,

హరించే గుణాన్ని ఈశ్వరుడుగా ,

దుష్ట సంహార  గుణాన్ని  దుర్గగా , 

లోకోధ్ధరణ గుణాన్ని   , కలహాల గుణాన్ని నారదుడుగా ,

అందాలకు ప్రతీకలుగా రంభ , ఊర్వశి , మేనకలుగా ,

ఎంతటి స్థితిలో ఉన్నా అతివల అందానికి బానిసయ్యే గుణాన్ని ఇంద్రుడుగా ,

ఉష్ణంతో కూడిన వెలుగుని సూర్యుడుగా ,

చల్లదనముతో కూడిన మసక వెల్తురుని చంద్రుడుగా , 

ఆయువుకి పట్టు అయిన ప్రాణవాయువును వాయువుగా , 

ఈ చరాచర సృష్టికి మూలాధారమైన ఉదకాన్ని గంగగా , 

ఆ గంగని ఆజమాయిషీ చేయగలిగిన శక్తిని శివుడుగా ,

గురి గల గురువుని బృహస్పతిగా ,

పంచేద్రియాలను నిర్దేశించగల గుణాన్ని గాయత్రిగా ,

సున్నితమైన గుణాన్ని , సాక్షాత్తు ఈశ్వరీదేవి గుణాలకు ప్రతీక శ్రీ లలితాపరమేశ్వరిగా  ,

ఙ్నాన , విఙ్నానాల భాండాగార నిలయాన్ని సరస్వతిగా , 

సిరి సంపదలను (అవి లేనిదే మానవ మనుగడ లేనే లేదు ) శ్రీలక్ష్మిగా ,

ఈ జగత్తు నడుపుటకై ఈ పై గుణాల  (శక్తుల ) నన్నింటినీ సృష్టించిన శక్తి స్వరూపిణిని జగన్మాతగా , పార్వతిగా ,

సత్యం , పుణ్యము  , ధర్మం , అహింస , మంచి లాంటి విశేష ( సు )గుణాలన్నింటినీ స్వర్గంగా ,

అసత్యం , పాపము , అధర్మం , హింస , చెడు లాంటి ( దు )ర్గుణాలన్నింటినీ నరకంగా ,

అటూ , ఇటు కాకుండా మధ్యలో అటొక కాలూ , ఇటొక కాలూ వేసేవాళ్ళ గుణాల్ని త్రిశంకు స్వర్గంగా , 

ఈ చర్య  కృతయుగారంభంలోనే ప్రారంభమైంది . ఆ యుగంలో ఎవరు ఏం చెప్పినా విని రించేవారు , ఆచరించే
వారు , ఎదురు చెప్పేవారు కాదు , వాదించేవారు కాదు . ఆ యుగ మానవులు ముందు యుగాలని ఊహించుకొని (ఈ నాడు ఉన్న దారుఢ్యం ముందు ముందు ఉండబోదని , కారణం ఈ మానవుల శక్తి నుంచే మరల సృష్టి జరుప
బడ్తున్నదని గ్రహించాడు ) యిలా ఆ నాడే ఫిక్స్ అయిపోయారు  .

ఆ తర్వాత యుగమైన త్రేతాయుగంలో ఆ శక్తే మానవరూపంలో అవతారమెత్తి మానవులతో సంచరిస్తూ , మగవారు ఏకపత్నీ వ్రతుడుగా ( అందినదానితో సంతృప్తి చెందాలని )శ్రీరాముడి ద్వారా ,

ఆడవారు తన బాగోగులు చూసుకొనే భర్త పంచన లేకుంటే , అపనిందలకు గురి అయి , నిరూపణ చేసుకొని తీరాల్సిం
దే నని సీత ద్వారా ,

అన్నదమ్ములు కలిసి మెలసి ఉండాలని లక్ష్మణ , భరత శతృఘ్నుల ద్వారా , 

భక్తుడు అంటే నిశ్చలమైన భక్తి గుణాలు కలిగి ఉండాలని వాయుపుత్రుడైన ( అంటే వాయువు కనపడదు , అలాగే ఆ వాయుపుత్రుడైన హనుమంతుని శక్తి కనపడదని , ఆ విషయం  మనకు తెలియచెప్పే టందు కే ' నీ శక్తి నీకు తెలియదంటూ ) హనుమంతుని ద్వారా ,

మానవుడెంతటి ( శక్తిమంతుడైనా ) వాడైనా , పర స్త్రీ లోలుడైతే నాశనమైపోతాడన్నది రావణుడి ద్వారా ,

ఆ తర్వాత యుగమైన ద్వాపరయుగంలో మఱల ఆ శక్తే మానవుల మధ్యన శ్రీకృష్ణుడిగా జన్మించి , సమాజంలో పేరుకుపోయిన దానవగుణాల్నినిర్మూలించి , నిష్కామప్రేమ ద్వారా ఆ శక్తి (గుణం )లో చేరిపోవచ్చు అని తెలియచెప్పటమైంది .

ఈ ద్వాపరయుగంలో మహాభారతం ద్వారా తెలియచేసిందేమిటంటే , పంచపాండవులు పంచేంద్రియాలకు ప్రతీకలు .
పంచేంద్రియాలు  ( వినుట , చూచుట , ఆఘ్రాణించుట , రుచి తెలుసుకొనుట , స్పర్శలు  ) .
పంచేంద్రియాలే పంచప్రాణాలు , ఆ పంచప్రాణాలు పంచపాండవులు , ఆరో ప్రాణం కర్ణుడు . 

పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిమాట జవదాటకూడదు అని కుంతి ద్వారా తెలియచేశారు . 

ఎంతటి శక్తిమంతుడైనా , స్థితిమంతుడైనా , ధైర్యవంతుడైనా , ఎన్ని మంచి గుణాలున్నా , ఒక్క దుర్గుణం (పరస్త్రీ వ్యామోహం ) వల్ల చరిత్రహీనులై పోతారని తెలియచేశారు దుర్యోధనుని ద్వారా .


ఆన్యాయం , అరాచకాల్ని సహించటానికి కొంత సమయం ఉన్నది . ఆ నిర్ణీత సమయం దాటినప్పుడు తన , పర భేదాలుండకూడదు అని అర్జునుడికి గీతోపదేశం ద్వారా అదే శ్రీకృష్ణుడు తెలియచేశాడు .

ఇలా యుగాలకొక్క రూపంలోనో , లేక అనేక రూపాల్లోనో  ఆ శక్తి సృష్టించి మానవులను సన్మార్గంలో నడిపించటానికి తన శాయశక్తులా తోడ్పడుతున్నది .

ఇక ఈ కలియుగానికి వస్తే , జనాభా అధికమై పోవటం వలన దేశాలకనుగుణంగా , ఎక్కడికక్కడ , ఎప్పటికప్పుడు మంచి గుణాలని మానవ రూపాలలో సృష్టించి , సన్మార్గంలో నడవటానికి దోహదపడ్తోంది . 

ఇలా తరచి చూస్తే ప్రతి దేవుడు / దేవత శక్తి అయిన గుణాలకు సంబంధించిన వాళ్ళే .

 అల్లా , క్రీస్తు ,శ్రీ దత్తాత్రేయ , మహావతార్ బాబాజీ , యిత్యాది మహాపురుషులందరూ ఈ శక్తి గుణాల కోవలో ని వారే . మొన్న మొన్నటీ శ్రీ షిర్డిసాయిబాబా వరకు .
 
డబ్బులు వడ్డీకి తీసుకొని స్వంత ఖర్చులకు వెచ్చించే వాళ్ళు ఎంత తీర్చినా అసలు అలాగే ఉంటుందన్న గుణాన్ని( ఎన్నటికీ  తీరని బ్యాంకు లోన్ అసలులా అని మనం తెలుసుకోవాలి ) శ్రీ వేంకటేశ్వర స్వామిగా .

మీరు ఏ పురాణం , ఏ ఇతిహాసం చూసినా ఇవే అందులో మనకు కనపడేది . అది తెలుసుకొని మసులుకొంటే అంద
మైనదీ జీవితం , లేకుంటే అందవిహీనమైనదే .

ఏ శక్తి మానవరూపం దాల్చినా , సాటి మానవుల్లాగే అంతమవాల్సిందేనని , అది తనచే శాసించబడిన ధర్మశాసన
మని తెలియచేస్తుంది  .అందుకే మానవరూపాలలతో పుట్టిన ఎంతటి శక్తిమంతులైనా , రామాయణ మహాపురు షులు , మహాభారత వీరులు , కలియుగ పుణ్య పురుషులు లాంటి అందరూ మరణించారు . ఇది మనకు తెలియ
వస్తున్న నగ్నసత్యమే .

గుణాలు ఎన్నో రకాలు . కనుక అనేక రూపాల్లో ఆవిర్భవిస్తూ మానవులను మహనీయులుగా తీర్చి దిద్ద ప్రయత్నం చేయటం జరుగుతున్నది . ( సద్గుణాలకనుగుణంగా  ) .

అవి మనలో ఉంటే మనమూ మహనీయులమే , ఆ సద్గుణాలకు వారసులమే . కనుక మన ఆలోచనా విధాల్ని మార్చుకోవాలే గాని , ఒక పక్క దేవుళ్ళకు పూజలు చేస్తూ , పురస్కారాలు జరిపిస్తూ , సాటి తోటి జీవులకు అన్యా యం చేయటంలో మీరు దుర్గుణ భూయిష్టమైన దుష్టదేవతలను ప్రోత్సహించటమే గుణాల పరంగా .

మంచి గుణాలు కలిగిన మానవుల్ని మనం దేవుని ప్రతిరూపాలుగా భావించి , మానవుడే మాధవుడు అని అన్ని
వేళలా చెప్పుకొంటుంటాము .

మీరనుకొంటున్నన్నట్లు సద్గుణాలు సత్యదేవుళ్ళు / సత్యదేవతలు . దుర్గుణాలు దుష్టదేవుళ్ళు  / దుష్టదేవతలుగా తెలుసుకోండి .

అంతే గాని దేవుడు / దేవత ఎక్కడో లేరు , ఉన్నది శక్తికి ప్రతిరూపాలైన సద్గుణాలే .

కనుక మనం ఆహ్వానించవలసినది దేవుణ్ణీ  / దేవతను కాదు , సత్ శక్తులైన సద్గుణాలని , మరువకండి , మననం చేసుకొంటుండండి . 

మనమూ మన జీవితాలని హాయిగా అనుభవించవచ్చు , మహనీయులమూ కావచ్చు . అది మన చేతులలో సారీ , మన  చేతలలోనే ఉన్నదన్నది అక్షరసత్యం , ఆచరణయోగ్యం కూడాను .

నిజానికి  కనపడేదంతా నిజం కాదు , శాశ్వతం కాదు . కనపడనిదే శాశ్వతం .  

నిజానికి నేటి పూజల కొలుపు ( వు ) భక్తా ?  భయమా ? అంటే , ఈ రెండింటిలో ఏదైనా ఒకటే ఉండాలనే వారు . కాని ఈ కలియుగంలో రెండూ కలిసిపోయాయి . భయంతో కూడిన భక్తిలా నిలిచిపోయాయి . 

దేవుళ్ళకు , దేవతలకు కొలుపులు , కొలువులు , పూజలు ఆపి , ఆ సద్గుణ శక్తుల్ని ఆవాహన ( ఆవాహన అంటే ఏదో  అనుకోకండి , మేళతాళాలు , భాజాభజంత్రీలు అవసరం లేదండి . మనఃస్ఫూర్తిగా ఆహ్వానించటమే ) అలా ఆహ్వానింపబడిన వారిని ఎంత గొప్పగా , గౌరవ్భావంతో చూస్తామో అలాగ ఆ ఆహ్వానించిన శక్తుల్ని చూసుకొంటే చాలు )  చేసుకొంటే చాలు , మనమూ అంతటి శక్తివంతులమౌతాము .  ఆ శక్తులని సద్వినియోగపరచుకోవలసిన అవసరం మన మీద ఎంతైనా వుంటుంది . 

ఇది తెల్సుకొని మసులుకొంటే , మనమే సర్వ సద్గుణశక్తికి వారసులమౌతాము ఆ శ్రీరాముడిలా , శ్రీకృష్ణుడిలా , ఏసుక్రీస్తులా , మహావతార్ బాబాజీలా , దత్తాత్రేయునిలా , ఆ  గురుపరంపర మానవ మహనీయుల్లా , షిర్డి సాయిలా .
ఇది అంత తేలికైన విషయం కానే కాదు . 

మనం  ఉన్నత పదవుల్లో వున్నవారిని ఆహ్వానించేటప్పుడు మన ఇంటిని , ఆ పరిసరాలని ఎంత అందంగ తీర్చిదిద్దుతామో ( వాళ్ళకు అనుగుణంగా ) , అలా మనమూ , మన శరీరాన్ని అలా  సన్నధ్ధం చేసి ఆ సద్గుణశక్తుల్ని ఆహ్వానించాలి . 
అంటే మనం  అరివీర భయంకరమైన అరిషట్వర్గాలని అదుపులో పెట్టుకోవాలి . ఆ పైనే ఆ సద్గుణశక్తులు మనలను మంచివారుగా , మహనీయులుగా మారుస్తూ , మన జీవితాల్ని మన ముందు తరాలవారికి మార్గదర్శకులుగా చూపిస్తాయి .  

కనుక మనం చేయాల్సిందల్లా ఒక్కటే . ఆ సద్గుణశక్తులు మనలో చేరే విధంగా సన్నాహాలు చేసి , ఆహ్వానించటమే .

తెలుసుకొన్నారుగా , ఇంక ఆ దిశగా అడుగులు వేయండి , మీకే తెలుస్తుంది మీరెంత మంచివారో .


ఇక ఆ పై ఎవరిష్టం వారిది . 

" సర్వే జనా సుఖినో భవంతు  , శుభం భూయాత్  ."   

చివరగా  చిన్న మాట ఇది నా అభిప్రాయం మాత్రమే  . 

మీ యిష్టం మీది , మీ జీవితం మీది . ఎవరి మీద ఎవరికీ అధికారం లేదు , వుండకూడదు కూడా . మమకారం మాత్రమే వుండాలి , అదీ ఎదుటివారి స్వేఛ్ఛను హరింపజేయనంతవరకు అని నమ్ముతున్నాను కనుక . మరి సెలవు .


                                                                             *********

ట ట్ట డాం టాం టాం

                                                                         ట ట్ట డాం  టాం టాం  
                                                                                                                                  రచన : శర్మ జీ ఎస్
                                                                                 జీ పి ఎస్
                                                                     ( గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం )
                                                          

    



అమెరికాలోఎక్కడకు వెళ్ళాలన్నా స్వంత వాహనం తప్పనిసరి . కాళ్ళను నమ్ముకొంటే చాలదు , కార్ల లాంటి                  
వాహనాను నమ్ముకోవాలి . ఈ అమెరికాలో కార్లే ( వాహనములు ) ఎక్కువ . ఒక మనిషికి ( ఆడ , మగ ) రెండుకాళ్ళు వుంటాయి . ఇది సహజమైన విషయమే , అందరకు తెలిసినదే . తే కార్లు మాత్రం రెండుకు పైనే వుంటుంటాయి ఆడవాళ్ళకు , మగవాళ్ళకు . కొంతమందికి ఈ వాహనాలే కాక , కిచెన్ వాహనం , ఇంకొంతమందికి లగేజ్ వాహనం , మరికొంతమందికి , బోట్ వహనం లాంటివి కూడా వుంటుంటాయి .ఇక్కడ యిళ్ళకు కార్ షెడ్ లంటూ వుండవు . పైగా కాంపౌండ్ వాల్స్ వుండనే వుండవు కూడా . ఈ యిళ్ళన్నీ కలప( చక్కల ముక్కలతో ) మిర్మిస్తారు . ఇంటిముందు అందమైన కళాకృతులతో చెట్లు , వామనని  ఆకారంలో వున్న చిన్ని చిన్ని మొక్కలకే అందమైన పూలు ఆనందాన్ని అందిస్తూ వుంటాయి . ఆవరలో  పచ్చపచ్చనివాతావరణంతో కళకళలాడుతూ వుంటుంది .                            

మనకొక సందేహం కలగవచ్చు , మరెక్కడ పార్క్ చేస్తారు యిన్ని కార్లని అని . నిజమే , వాళ్ళకొక షెడ్ వుంటుంది ప్రతి యింటికి . ఆ షెడ్ ని గార్బేజ్గా వుపయోగించుకొంటుంటారు . ఆ మెయిన్ డోర్ షట్టర్ లా పైకి ఓపెన్ చేయ
బడ్తుంది . దానికెదురుగా బైట ఒక కార్ పార్క్ చేస్తారు . మిగిలిన వాహనాలను వాళ్ళ యింటి ఎదురుగా రోడ్ మీద పార్క్ చేస్తారు . మెయిన్ రోడ్లు మాత్రం విశాలంగా 3 లైన్లు కుడి వైపు , మరో 3 లైన్లు ఎడమ వైపు వుంటాయి రైట్ సైడ్ డ్రైవింగ్ తో , లెఫ్ట్ హాండ్ స్టీరింగుతో .అడ్డరోడ్లలోనే నివాసగృహములు వుంటాయి .

అసలు విషయానికి వద్దాం . ఏ దేశస్థుడైనా ఈ అమెరికాలోని ఏ స్టేట్ చూడదలచుకున్నా చాలా దుర్లభమే . ఎందు
కంటే వాహనంలో బయలుదేరిన తర్వాత ఎవర్నీ అడ్రెస్ అడగటానికి వీలుపడదు . సిటీలో మెయిన్ రోడ్ మీద వాహ
నాల వేగం 40 మైల్స్ అంటే 64 కిలోమీటర్లు . అడ్డరోడ్డులో 25 ( 40 కిలో మీటర్లు ) నుంచి 35 ( 56 కిలో మీటర్లు )  మైళ్ళ వేగం .  స్టేట్స్ ని మాత్రమే కాదు లోకల్ లోని వాటిని కూడా ఎటు వెళ్తే మన గమ్యం వస్తుందో తెలియకపోతే , మనం ఎటూ వెళ్ళలేం మహా కష్టం .ఇండియాలోలా యిక్కడ బస్సులలో వెళ్ళి చూసే ప్రదేశాలు కాదు . ఇండియాలో బస్సులు , యిక్కడ ఎయిర్ బస్సులే . అలా వెళ్ళటం ఖర్చుతో కూడుకున్నదే . లోకల్ వాళ్ళకు ఖర్చుగా భావించరు .
ఇలాంటి యిబ్బందులు ఎవరికీ కలగకుండా అమెరికన్ సైంటిస్ట్ తను 1956 లో కనుక్కొన్న జీ పి ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిష్టం ని  ప్రత్యేక శ్రధ్ధ తీసుకొని మోడర్నైట్ చేసి అందించాడు 1998 లో . ఆ నాటినుంచి ఈ దుస్థిని మెలమెల్లగ అధిగమించటం జరిగినంది .

ఈ జీ పి ఎస్ ని వాహనంలో స్టీరింగ్ పరిసర ప్రాంతాల్లో కనపడేటట్లుగా ఫిక్స్ చేసి ప్లగ్ లో పెట్టి , ఆన్ చేసి మన గమ్యం 
అందులో ఫీడ్ చేస్తే అది , తన వద్దనున్న సమాచారంతో మనకెదురుగా దర్శనమిస్తుంది .

మన గమ్యం ఎన్ని మైళ్ళ దూరంలో వున్నది , ఎంత టైం లో అక్కడకి చేరుకుంటామో బయలుదేరే సమయాన్ని బట్టి స్క్రీన్ మీద చూపిస్తుంది . అంతే కాకుండా మనం వెళ్ళే ప్రదేశంలో వాతావరణం ఎలా వుందో తెలియచేస్తుంటుంది .  మనమున్న ప్రదేశం నుంచి ఎటు వెళ్ళాలి ? అక్కడ ఎన్ని రోడ్లు వున్నాయి , ఏ రోడ్డులో వెళ్ళాలి ? అలా ఆ రోడ్ స్ట్రైట్ గా వుంటే , ఎన్ని మైళ్ళు అలా వున్నదో ( ప్రయాణించాలో ), ఎక్కడ రైట్ తీసుకోవాలో , ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసు
కోవాలో , ఏ రోడ్డు ఎన్ని వంకరలు తిరుగుతూ వెళ్తుందో ,అన్నీ తను చూపిస్తూ , స్పీకర్ లో వినిపిస్తూ , మనం ఎక్క
డైనా హోటల్ , లేదా గ్యాస్ ఫిల్లింగ్ బంక్స్ ( పెట్రోల్ ) వద్ద ఆగాలనుకుంటే ( బ్రేక్ అంటారు ) , దానికి నువ్వు వున్న చోటినుంచి ఎటు వెళ్తే ఎగ్జిట్ వస్తుందో చూపిస్తూ , వినిపిస్తుంది . మళ్ళీ అక్కడ నుంచి మనం మన గమ్యానికి ఎంత సమయంలో చేరుకోగలమో ,స్క్రీన్ మీద చూపిస్తూ , మైక్ ద్వారా వినిపిస్తుంది . ఓ వేళ పొరపాటున మనం దారి తప్పితే , అలా ఆ వున్న చోటినుంచి మనం వెళ్ళవలసిన గమ్యాన్ని తెలియచేస్తుంది . మన గమ్యంలో ఎక్కడ తోల్ గేట్లున్నాయో , చూపిస్తూ వివరిస్తూ మనల్ని క్షేమంగా గమ్యం చేరుస్తుంది .ఇంతే కాకుండా అది సూచించిన ప్రకారం మనం ఆ రోడ్లలో వెళ్తుంటే , మన వాహనం ఏక్కడ వున్నదో మనకు డిస్ప్లేలో కనపడ్తుంటుంది . ఇదంతా శాట్లైట్ ద్వారా జరుగుతున్నది . అయితే ఆ జీ పి ఎస్ లో ఈ అమెరికాలోని అన్నిరూట్లను అందులో ఫీడ్ చేయటం వల్ల ( ఏ రోడ్డు ఎక్కడనుంచి ఎంతదూరం వున్నది మైళ్ళలో ) ఏమీ తెలియని , డ్రైవింగ్ వచ్చివారెవరైనా , వెళ్ళాలనుకున్న     
వారెవరైనా అతి సులభంగా వెళ్ళి రాగలుగుతున్నారు .

ఇక్కడ మనకు వాహనం లేకున్నా ( మనకు డ్రైవింగ్ వచ్చుంటే , డబ్బుంటే , చూడాలని అభిలాష , అవకాశం వుంటే  ) అద్దెకిస్తారు . హాయిగా ఎంతదూరమైనా ఎక్కడికైనా వెళ్ళి చూడదలచుకున్నవన్నీ చక్కగా చూసి రావచ్చు .అందు వలననే ఇప్పుడు అమెరికాలో ఏ స్టేట్ నయినా అతి సులభంగా చూడగలుగుతున్నారు ఏ దేశస్థులైనా .

ఇటువంటి దాన్ని కనిపెట్టిన రోగర్ ఎల్ ఈస్టన్ ఏప్రిల్ 30 1921 క్రాఫ్ట్స్ బరీ లో పుట్టారు  .
   
 ఇప్పుడు ఈ టెక్నాలజీతో చాలా చాలా కంపెనీలు జీ పి ఎస్ లను తయారు చేసి మనకు అందుబాటులోకి తెచ్చాయి . 

అందుకే ఈ నాడు ఎవరైనా , ఎక్కడికైనా , ఎప్పుడైనా , ఎవ్వరినీ అడగకుండా హాయిగా చూసి రాగలుగుతున్నాము .
ప్రజాశ్రేయస్సుకి పాటుపడే ఇటువంటి వాళ్ళకు అనంతకోటి మానవుల అభినందనలు  అందించాలన్న తలంపుతో యిది వ్రాయటం జరిగింది  ఈ బ్లాగు ద్వారా .   

  
                                                                    **********                                                        
                                                                                                                

నా న్యూ నుడులు - 6





1   చెప్పుచేతల్లో పెరుగుతుంటే ,
    జీవితం బహు భేషుగ్గా ఉన్నట్లే .

2   చెప్పు చేతుల్లోకి వచ్చిందంటే , 
    కాళ్ళు మల మల మాడినట్లే . 

3   రసాలకు ఓ సీజన్ అంటూ ఉంటుంది ,
    సరసాలకు ఓ సీజన్ అంటూ ఉండదు .

4   శృంగారం బంగారం ధర్మపత్నితో ,
    శృంగారం అంగారం పరపత్నితో .

5   రక్తి అనుభవించనిదే విరక్తి కలుగదు ,
    ముక్తి లభించకుంటే విముక్తి దొరకదు .

6   ఇంగ్లీష్ వాళ్ళు రేప్ ని అత్యాచారానికి నిదర్శనంగా శాసించారు ,
     తెలుగు వాళ్ళు రేపు ని భవిష్యత్తుకి బంగారు బాటగా భావించారు .

7   సద్గుణం కలకాలం ఉండాలని మెలమెల్లగా అలవడ్తుంది .
     దుర్గుణం దొరికిందే ఛాన్సుగా తక్షణమే అంటుకుంటుంది . 

8   మనం  మొబైల్ని వాడుకుంటున్నట్లే  ,
     మనల్ని కొంతమంది వాడుకొంటుంటారు .

9   ఆడవారిని ఇంత అని  చెప్పడం  వల్లకాక ,
     ఇంతి అని సింపుల్ గా చెప్పి వదిలేశారు  . 

10   ఆ నాడు ఉద్యోగం పురుష లక్షణం ,
       ఈ నాడు ఉద్యోగం పౌరుష లక్షణం  .

                                                                                                  (  మళ్ళీ కలుసుకొందాం  )
                                   
                         **********